అయుష్ 24 న్యూస్, మంథని: మంథని మండలం ఏక్లాస్‌పూర్ గ్రామంలో బుధవారం పల్లె దవాఖాన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణ, హెచ్‌ఐవీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఎల్‌హెచ్‌పీ డి. జ్యోతి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీని ప్రారంభ దశలోనే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీ ఉందో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తాయి, వాటి లక్షణాలు ఏమిటి, వ్యాధిని ఎలా అరికట్టాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ ఎం. శ్రీనివాస్, హెల్త్ సూపర్‌వైజర్ ఉమాదేవి, ఐసీటీసీ కౌన్సిలర్ సత్యానందం, కమ్యూనిటీ కోఆర్డినేటర్ రాజేశ్వరి, ల్యాబ్ టెక్నీషియన్ సుకుమార్, ఏఎన్‌ఎం స్వప్న, ఆశా వర్కర్లు రజిత, రాజేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply