దేవరకొండ ప్రతినిధి | సెప్టెంబర్ 9 | అయుష్ 24 న్యూస్
దేవరకొండ విద్యుత్ శాఖ ఏడీఈగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎన్. శ్రీనివాస్ రెడ్డిని ఐఎన్టీయూసీ 327 యూనియన్ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు.
దేవరకొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ 327 యూనియన్ జిల్లా సెక్రటరీ నిరంజన్ అలీ ఏడీఈ ఎన్. శ్రీనివాస్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం యూనియన్ నాయకులతో కలిసి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ దేవరకొండ ప్రాంతంలో విద్యుత్ రంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యాలయ సిబ్బంది, లైన్మెన్లు, ఫోర్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు తదితర సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే విద్యుత్ సేవలను మరింత మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు.
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, దేవరకొండ విద్యుత్ శాఖ అభివృద్ధికి అధికారులు, సిబ్బంది కలిసి పనిచేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ 327 యూనియన్ నాయకులు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply