“ఇక్కడి నుంచి రావద్దు” అంటూ కట్టెలు, కవర్లతో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసిన స్థానికులు
పట్టించుకోని అధికారులు.. రాత్రివేళ మరింత ప్రమాదకర పరిస్థితి
దేవరకొండ, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): పడమటపల్లి నుంచి కందుకూరుకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మధ్యలో పిడబ్ల్యూడీ పరిధిలో మోకాలు లోతు గుంత ఏర్పడినా సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.

రోడ్డుపై ఏర్పడిన భారీ గుంత కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రమాదాలను నివారించేందుకు స్థానికులు రహదారి మధ్యలో కట్టెలు, కవర్లు ఏర్పాటు చేసి ప్రమాద సూచికలు పెట్టారు. “ఇక్కడి నుంచి రావద్దు.. ప్రమాదం ఉంది” అనే విధంగా వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.
ఆర్అండ్బీ అధికారులకు తెలియకపోవడం శోచనీయం
రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడి చాలా రోజులైనా ఆర్అండ్బీ అధికారుల దృష్టికి రాకపోవడం లేదా తెలిసినా పట్టించుకోకపోవడం విచారకరమని స్థానికులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుంత సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సమీప తండాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోకుంటే ప్రమాదాలే ప్రమాదాలు
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి మధ్యలో ఏర్పడిన గుంతను వెంటనే పూడ్చి, రహదారిని సురక్షితంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply