లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో నిర్వహణ.. 161 మందికి ఉచిత కంటి పరీక్షలు
దేవరకొండ, ఆగస్టు 23, అయుష్షు 24 న్యూస్:
ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సహకారంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు లయన్ గుద్దేటి జంగయ్య తెలిపారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రధాన కార్యదర్శి లయన్ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు కాశిరెడ్డి రఘుమా రెడ్డి జ్ఞాపకార్థం, ఆయన మనవడు రితిక్ రెడ్డి ఆర్థిక సహకారంతో ఆదివారం దేవరకొండ మండలంలోని కమలాపూర్ గ్రామ రైతు వేదికలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా లయన్ గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ పేద ప్రజల అవసరాలను తీర్చేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా ఆర్థిక సహకారం అందిస్తూ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. గత నెలలో లయన్ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముదిగొండ గ్రామంలో కూడా ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
కమలాపూర్‌లో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 161 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యుల సూచనలు, తదుపరి చికిత్సకు సంబంధించిన సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాశిరెడ్డి సునీత వెంకట్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, సీనియర్ లయన్ గాజుల రాజేష్, తిప్పర్తి రుక్మారెడ్డి, లకుమారపు మల్లయ్య, మాజీ సర్పంచ్ రేపాని ఇదయ్య, ఆప్టోమెట్రిస్ట్ హరి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply