కాయ్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుల సత్తా
కరీంనగర్: ఇటీవల కలకత్తాలో జరిగిన కాయ్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలలో పతకాలు సాధించిన తెలంగాణ కరాటే క్రీడాకారులను కరీంనగర్ నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ తన చాంబర్‌లో ప్రత్యేకంగా అభినందించారు.ఈ జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు.
గోల్డ్ మెడల్స్:
ఇ. రుద్రతేజ్ – 14-15 వయసు విభాగం, -57 కిలోల కుమిటేజి. శాన్వి – 10-11 వయసు విభాగం, -30 కిలోల బాలికల విభాగంజి. ధ్రువ నాయక్ – 8-9 వయసు విభాగం, +20 కిలోలు
సిల్వర్ మెడల్స్:
బి. వివాన్ష్ – 8-9 వయసు విభాగం, -25 కిలోలుఎస్. సుప్రతిక్ – 10-11 వయసు విభాగం, +30 కిలోలు
బ్రాంజ్ మెడల్స్:
ఎం.డి. అర్హాన్ అలీ – 12-13 వయసు విభాగం, -40 కిలోలుశ్రీ నకుల్ – 16-17 వయసు విభాగం, -68 కిలోలుఆర్. అన్విత్ – 14-15 వయసు విభాగం, -52 కిలోలుఅల్ఫియా తబస్సుమ్ – 10-11 వయసు విభాగం, +40 కిలోలుఇ. రిషి – 16-17 వయసు విభాగం, -57 కిలోలుపతకాలు
సాధించిన క్రీడాకారులతో పాటు కాయ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సురభి వేణుగోపాల్ను, కోచ్‌లుగా వ్యవహరించిన ఇంద్ర సురభి, సంజీవ్, అన్వేష్ సురభి, వినేష్, ముత్తయ్యలను కూడా మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.క్రీడాకారుల ప్రతిభను అభినందిస్తూ వారికి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply