భౌతికకాయానికి పూలమాల వేసి ఘన నివాళి
ఎలిగేడు/పెద్దపల్లి, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన కల్వల ప్రజ్ఞ దీప్ (డింపు) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న దాసరి ఉష వెంటనే నర్సాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజ్ఞ దీప్ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి బాధలో తాను భాగస్వామినని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని దాసరి ఉష ఆకాంక్షించారు.










Leave a Reply