సూర్యాపేట జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
సూర్యాపేట, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పథకాల నిధులను వెంటనే విడుదల చేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం అందించాలని కోరారు.
అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పథకాల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, పేదల ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply