ఇల్లందులో బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో నిరసన
ఇల్లందు, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
బీఆర్‌ఎస్ ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జి బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ జేకే కాలనీ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. అలాగే ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
ర్యాలీలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










Leave a Reply