రెండోసారి నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి
అభినందనలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ ప్రతినిధి | సెప్టెంబర్ 9 | అయుష్ 24 న్యూస్
యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు చురుగ్గా పనిచేస్తున్న డిండి మండలం ప్రతాప్‌నగర్ గ్రామానికి చెందిన జరుపుల లక్ష్మీ తిరుపతిని నాగర్‌కర్నూల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా రెండోసారి నియమించినట్లు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో లక్ష్మీ తిరుపతి కీలకంగా పనిచేశారని తెలిపారు. ఆమె సేవలను గుర్తించి మరోసారి జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు
నాగర్‌కర్నూల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా రెండోసారి నియమితులైన జరుపుల లక్ష్మీ తిరుపతి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి, రాష్ట్ర ఇన్చార్జి ఖలీద్‌కు, కో-ఇన్చార్జిలు రోహిణి, భవ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.
తన నియామకానికి ప్రత్యేకంగా సహకరించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని లక్ష్మీ తిరుపతి తెలిపారు.



Musini.Anjan





Leave a Reply