సెప్టెంబర్ 2న ఇల్లందులో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన
ఇల్లందు | అయుష్ 24 న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న సమరభేరి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ భానోత్ హరిప్రియ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సమరభేరి కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటలకు ఇల్లందు క్యాంపు కార్యాలయం నుంచి 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఇల్లందు పట్టణ, మండలాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా, యువజన, సోషల్ మీడియా విభాగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హరిప్రియ నాయక్ కోరారు.










Leave a Reply