16వ వార్డు కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ పిలుపు
దేవరకొండ, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, మహాధర్నాను విజయవంతం చేయాలని 16వ వార్డు కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి భారీ ర్యాలీ ప్రారంభమై, బస్స్టాండ్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందని రూప్ల నాయక్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
పోరుబాట మహాధర్నాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply