420 మీటర్ల ఫ్లెక్సీతో వినూత్న రీతిలో ర్యాలీ.. సుమారు 5 కిలోమీటర్ల మేర కొనసాగిన నిరసన
సూర్యాపేట జిల్లా, సెప్టెంబర్ 3 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. ఈ సందర్భంగా హామీలను ప్రస్తావిస్తూ రూపొందించిన 420 మీటర్ల పొడవైన ఫ్లెక్సీతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ శంకర్ విలాస్ సెంటర్, రాఘవ ప్లాజా, పీఎస్ఆర్ సెంటర్, పూల సెంటర్, గాంధీ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. సుమారు 5 కిలోమీటర్ల మేర సాగిన ఈ నిరసన ర్యాలీలో బీఆర్‌ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ర్యాలీకి పట్టణ ప్రజలు పలుచోట్ల స్పందిస్తూ మద్దతు తెలిపారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగించారు.










Leave a Reply