6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్
మంథని, సెప్టెంబర్ 7 – అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంథని మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మంథని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఏ. గోలపు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే, మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
“100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు”
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారు ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మంథని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా నిరసన తెలిపారు.
అనంతరం 420 హామీలు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు కోసం తమ పోరాటం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
“హామీలు అమలు చేయాలి – ప్రజలకు న్యాయం చేయాలి” అని బీఆర్ఎస్ నాయకులు నినదించారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply