- జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేసిన వైనం
- పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శి వైఫల్యంపై విమర్శలు
దేవరకొండ, ఆగస్టు 16: నల్లగొండ జిల్లా డిండి మండలంలోని కామేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఏర్పాటు చేసి ఎగరవేసిన ఘటన చోటుచేసుకుంది.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామ సర్పంచ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే జెండాలో పైభాగంలో ఉండాల్సిన కాషాయ రంగు కిందికి, కింది భాగంలో ఉండాల్సిన ఆకుపచ్చ రంగు పైకి ఉండేలా జాతీయ జెండాను తలకిందులుగా ఏర్పాటు చేసినట్లు స్థానికులు గుర్తించారు.దీంతో అక్కడే ఉన్న పలువురు వెంటనే విషయాన్ని గుర్తించి జాతీయ జెండాను సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం హడావుడిగా జెండాను దించి, సరిచేసి కాషాయ రంగు పైభాగంలో ఉండేలా తిరిగి ఏర్పాటు చేసి ఎగరవేసినట్లు సమాచారం.పర్యవేక్షించాల్సిన కార్యదర్శి వైఫల్యంజాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి ముందుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. జెండా ఏర్పాటు, తోరణాలు, పరిసరాల పరిశుభ్రత తదితర ఏర్పాట్లను ముందుగానే పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, జాతీయ జెండా తలకిందులుగా ఏర్పాటు కావడం పర్యవేక్షణ లోపాన్ని స్పష్టంగా చూపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.జాతీయ జెండా విషయంలో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
– అయుష్ 24 న్యూస్, దేవరకొండ










Leave a Reply