ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎంపిక
కామేపల్లి: తెలంగాణ ప్రగతిశీల అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ అనుబంధం) కామేపల్లి అంగన్వాడీ ప్రాజెక్టు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఐఎఫ్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ సుభహన్ అధ్యక్షతన కామేపల్లి మండలం లింగాల క్రాస్‌రోడ్డులోని ఫంక్షన్ హాల్లో నిర్మాణ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం
- అధ్యక్షురాలు: కే. పద్మ — బర్లగూడెం, కామేపల్లి మండలం
- ఉపాధ్యక్షురాలు: పారిజాతం — లచ్చగూడెం, ఏన్కూరు మండలం
- ప్రధాన కార్యదర్శి: శిరోమణి — శ్రీరాంగిరి, ఏన్కూరు మండలం
- సహాయ కార్యదర్శి: సుధారాణి — కారేపల్లి మండలం
- కోశాధికారి: విజయ — రాఘవాపురం, ఏన్కూరు మండలం
కమిటీ సభ్యులు: కోటమ్మ, సుశీల, భూలి, లతకుమారి, విజయ, కమల.
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి పోరాటం
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు కే. పద్మ, ప్రధాన కార్యదర్శి శిరోమణి మాట్లాడుతూ.. కామేపల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.

అంగన్వాడీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, మౌలిక వసతులు, ఉద్యోగ భద్రత వంటి సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు.
చాలా అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్లు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా టీచర్ల కొరత కూడా ఉందని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇంకా అందలేదని, వాటిని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
అంగన్వాడీ కార్యకర్తలపై అధిక పనిభారాన్ని తగ్గించాలని, అధికారుల వేధింపులకు స్వస్తి పలకాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు మాదారపు ఉమాశంకర్, లక్ష్మీమణి, రాజ్యలక్ష్మి, కృష్ణకుమారి, పద్మ, జానకమ్మ, వెంకట్ లక్ష్మి, ఆదెమ్మ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply