అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష
కుల్కచర్ల, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్
కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రైతులకు కందులు, పెసర్ల విత్తనాలను పంపిణీ చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply