కుల్కచర్ల, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్
కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply