నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టాలి
సర్వారెడ్డి సేవలు చిరస్మరణీయం
తాడేపల్లి | అయుష్ 24 న్యూస్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని సీపీఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాశయ్య పిలుపునిచ్చారు.
మంగళవారం తాడేపల్లిలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో బుర్ర ముక్కు సర్వారెడ్డి 12వ వర్ధంతి సభ సీపీఐ తాడేపల్లి ప్రాంత సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ముందుగా సీనియర్ నాయకులు మానికొండ డాంగే సర్వారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సర్వారెడ్డి తాడేపల్లి ప్రాంతంలో ప్రజా సమస్యలు, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని తుడిమెల్ల వెంకటయ్య, రైతు నాయకుడు పెద్ది శెట్టి వీరస్వామి అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో మానికొండ డాంగే, ఉద్దంటే శివ, మునగాల రామారావు, షేక్ బాషా, శీలం శ్యామ్ ప్రసాద్, ఎన్. లక్ష్మణ్, లంకె ప్రసన్న, శీలం అనిల్ కుమార్, లంకె ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply