దేవరకొండ, ఆయుష్ 24 న్యూస్:నేరేడుగొమ్ము మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఎస్‌ఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేజీబీవీ పాఠశాలలో జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించడం జాతీయ జెండాకు అవమానకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు దేశభక్తి, జాతీయ గౌరవం నేర్పాల్సిన విద్యాసంస్థలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటని అన్నారు.జాతీయ జెండాను అవమానపరిచిన కేజీబీవీ ఎస్‌ఓతో పాటు బాధ్యులైన పాఠశాల సిబ్బందిపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని పానుగంటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply