Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › ఉమ్మడి నల్లగొండ › కొండమల్లేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాల, వసతిగృహాన్ని సీజ్ చేయాలి: ఆర్టీఐఎస్ఎస్
ఉమ్మడి నల్లగొండ

కొండమల్లేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాల, వసతిగృహాన్ని సీజ్ చేయాలి: ఆర్టీఐఎస్ఎస్

10:42 ఉదయం AM

కలెక్టరేట్ ప్రజావాణిలో సమగ్ర వినతిపత్రం అందజేసిన సంస్థ నాయకులు

నల్లగొండ: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలు, న్యాయస్థానాల ఉత్తర్వులకు విరుద్ధంగా పాఠశాల, అనుమతి లేని వసతిగృహం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ, వాటిని వెంటనే మూసివేసి సీజ్ చేయాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్టీఐఎస్ఎస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంస్థ జాతీయ అధ్యక్షుడు కేతావత్ బాబురామ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల వినోద్ కుమార్ సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో ‘ఎస్పీఆర్’ బ్రాండ్ పేరును ఉపయోగించకూడదంటూ రంగారెడ్డి జిల్లా వాణిజ్య న్యాయస్థానం 2025 ఆగస్టు 11న సి.ఓ.ఎస్. నం.21/2024 (ఐ.ఏ. నం.292/2024)లో ఉత్తర్వులు జారీ చేసిందని ఆర్టీఐఎస్ఎస్ నాయకులు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జారీ చేసిన ఆర్‌సీ నం.3668/ఏ2/2025కు సంబంధించిన 2026 జూలై 21, ఆగస్టు 1 తేదీల ప్రొసీడింగ్స్ ప్రకారం సదరు పేరును నిలిపివేయాలని ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన డబ్ల్యూ.పి. నం.12250/2026 ఉత్తర్వులను కూడా ఉల్లంఘిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు.

పాఠశాలల గుర్తింపు, నిర్వహణకు సంబంధించిన జీవో నం.1, జీవో నం.91 నిబంధనల ప్రకారం ప్రభుత్వ ముందస్తు అనుమతి, గుర్తింపు లేకుండా కొత్త పేరుతో తరగతులు నిర్వహించడం, ప్రవేశాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని సంస్థ నాయకులు పేర్కొన్నారు.

వాల్టా చట్టం–2002 నిబంధనలకు విరుద్ధంగా చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ పరిధిలో పాఠశాల భవనం నిర్మించారని కూడా వారు ఆరోపించారు. విద్యా హక్కు చట్టానికి సంబంధించిన నిబంధనలను పాటించకుండా, ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ, భవన పటిష్టత ధ్రువీకరణ పత్రాలు లేకుండానే వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

గతంలో జిల్లా కలెక్టర్ 2026 ఆగస్టు 3న విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశించినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆర్టీఐఎస్ఎస్ నాయకులు ఆరోపించారు. సెప్టెంబర్ 24న నోటీసు అందజేసినప్పటికీ స్పందన లేదని పేర్కొన్నారు.

తాజా వినతిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారికి కలెక్టర్ ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్లు ఆర్టీఐఎస్ఎస్ నాయకులు తెలిపారు. వారం రోజుల్లో పాఠశాల, వసతిగృహంపై చర్యలు తీసుకోవడంతో పాటు అనుమతుల అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకోని పక్షంలో హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో పాటు తెలంగాణ లోకాయుక్తను ఆశ్రయిస్తామని ఆర్టీఐఎస్ఎస్ నాయకులు తెలిపారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 30🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App