కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమం.. పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు వడ్త్య రమేష్
కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి మండలంలో నిర్వహించిన మహిళల వంటా–వార్పు కార్యక్రమంలో బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply