జడ్చర్ల, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్
జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో వల్లబ్ దాస్ గౌడ సంఘం ఆధ్వర్యంలో కోట మైసమ్మ ఆలయంలో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాస్టర్ కేశవ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, మాజీ డిప్యూటీ సర్పంచ్ రాజు గౌడ్, సుభాష్ గౌడ్, కిషోర్ గౌడ్, శేఖర్ గౌడ్, నరేందర్ గౌడ్, ఆదిత్య గౌడ్, సాయి గౌడ్, కన్నయ్య గౌడ్, ఆర్యన్ గౌడ్, సూర్య దేవాన్ష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply