మంథని పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న కోతుల బెడద.. ప్రజల్లో ఆందోళన
మంథని, ఆగస్టు 24, అయుష్ 24 న్యూస్: మంథని పట్టణంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కోతులు ఇళ్లలోకి ప్రవేశిస్తూ స్వైరవిహారం చేయడంతో పాటు, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.
కోతుల బెడద కారణంగా పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, కమిషనర్ మనోహర్ చొరవతో కోతులను పట్టేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని పిలిపించి బోన్లను ఏర్పాటు చేసి కోతులను పట్టించినప్పటికీ, పట్టణంలో కోతుల బెడద పూర్తిగా తగ్గలేదని స్థానికులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రతి వార్డులో బోన్లు ఏర్పాటు చేసి, కోతులను పట్టే ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. కోతుల బెడదకు తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కోతుల బెడదను పూర్తిగా నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply