అభినందించి ప్రోత్సహిస్తున్న అలెక్స్ అకాడమీ నిర్వాహకుడు మాతంగి వంశీ
దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ దేవరకొండకు చెందిన విద్యార్థి ఎండీ మైనుద్దీన్ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. మండల స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
దేవరకొండ పట్టణంలోని అలెక్స్ అకాడమీ నిర్వాహకుడు మాతంగి వంశీ ఆధ్వర్యంలో ఇటీవల మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దేవరకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ సలీం కుమారుడు ఎండీ మైనుద్దీన్ ప్రతిభ కనబరిచి విజయం సాధించాడు.
పట్టణంలోని ఎస్‌పీఆర్ ఎక్సలెన్సీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మైనుద్దీన్ విద్యతో పాటు క్రికెట్‌లోనూ మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అండర్-16 స్థాయి పోటీల్లో అతని ఆటతీరును గమనించిన అలెక్స్ అకాడమీ నిర్వాహకుడు మాతంగి వంశీ అతడిని అభినందించి ప్రోత్సహించారు.
మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన మైనుద్దీన్‌ను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
జిల్లా స్థాయి పోటీల్లో కొనసాగుతున్న మైనుద్దీన్
మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన మైనుద్దీన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అండర్-16 జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నాడు. వరుసగా మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు.
జిల్లా స్థాయిలోనూ విజయం సాధించి ప్రతిభ కనబరిస్తే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. మైనుద్దీన్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.



Musini.Anjan





Leave a Reply