ఎస్‌ఐఆర్ ప్రక్రియ, పార్టీ వ్యవహారాలపై చర్చ
న్యూఢిల్లీ, ఆగస్టు 21 — అయుష్ 24 న్యూస్:
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గేను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలు, ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియపై మల్లికార్జున్ ఖర్గేతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చర్చించారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, రాబోయే రెండు నెలల్లో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తామని తెలిపారు.
అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ పనిచేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలో జరగనున్న క్యాబినెట్ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను కోరినట్లు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply