దేవరకొండకు చెందిన నేనావత్ సింహచలం.. స్పాన్సర్‌షిప్ కోసం ఎదురుచూపులు
దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ మండలం సీతారాం తండాకు చెందిన యువ క్రీడాకారుడు నేనావత్ సింహచలం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా ఏషియన్ యూనియన్ గేమ్స్’కు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సింహచలం పలు సవాళ్లను అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకోవడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడా ప్రయాణంలో ప్రారంభం నుంచి తనకు అండగా నిలుస్తూ ఆర్థిక, మానసిక సహకారం అందించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్‌కు సింహచలం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన సహకారం క్రీడాకారుడికి ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.
స్పాన్సర్‌షిప్ కోసం ఎదురుచూపులు
అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన సింహచలానికి ప్రయాణం, శిక్షణ, ఇతర అవసరాల కోసం ఆర్థిక సహాయం అవసరమని కుటుంబ సభ్యులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన యువతను ప్రోత్సహించేందుకు దాతలు, సంస్థలు ముందుకు వచ్చి అవసరమైన స్పాన్సర్‌షిప్ అందించాలని కోరుతున్నారు.

సరైన ఆర్థిక సహకారం లభిస్తే రాబోయే పోటీలకు మెరుగైన సన్నద్ధతతో పాల్గొనే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. సింహచలం తన ప్రతిభతో మంచి ఫలితాలు సాధించి దేవరకొండ ప్రాంతానికి, తెలంగాణకు పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.



Musini.Anjan





Leave a Reply