మంథని: మంథని పట్టణంలోని 4వ వార్డు గంగాపురికి చెందిన గుండేటి నాగమణి–సంపత్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు హాజరై, నాగమణి–సంపత్ దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ద్వారా సొంతింటి కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయడంలో సహకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీనుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
– అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, మంథని









Leave a Reply