4వ వార్డులో కోతుల పట్టివేత.. ప్రజలకు ఊరట
మంథని, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్:
గంగాపురి 4వ వార్డులో గత కొంతకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడదకు పరిష్కారం లభించింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు కోతులను పట్టుకునే చర్యలు చేపట్టారు.
గత కొంతకాలంగా కోతులు ఇళ్లలోకి ప్రవేశించి ఆహార పదార్థాలను తీసుకెళ్లడం, ఇంట్లోని వస్తువులను చిందరవందర చేయడం, పండ్లు, కూరగాయలను నాశనం చేయడం వంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వీధుల్లో సంచరిస్తూ చిన్నారులు, వృద్ధులు, మహిళలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని స్థానికులు తెలిపారు.
కోతులు ఇళ్ల పైకప్పులు, విద్యుత్ తీగలపైకి ఎక్కడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గంగాపురిలో కోతులను పట్టుకునే చర్యలు చేపట్టడంతో స్థానిక ప్రజలకు కొంత ఊరట లభించింది.
ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయెందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డిలకు 4వ వార్డు కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల భద్రత, సంక్షేమం కోసం ఇలాంటి సమస్యలపై అధికారులు త్వరితగతిన స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.









Leave a Reply