ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు.. 4వ వార్డులో మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్
గంగాపురి: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు గంగాపురిలో దోమల నివారణకు ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల బెడదను నియంత్రించేందుకు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఫాగింగ్ నిర్వహించినట్లు 4వ వార్డు కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు తెలిపారు.
వార్డులో దోమల సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి ఫాగింగ్ నిర్వహించినట్లు కౌన్సిలర్ పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల వృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు మున్సిపాలిటీ తరఫున చేపడుతున్న పారిశుద్ధ్య, దోమల నివారణ చర్యలకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డికి కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నివారణ చర్యలను మరింత విస్తృతంగా కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply