మంథని, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): మంథని మున్సిపల్ పరిధిలోని పద్మశాలి వీధిలో గజానన యూత్ ఆధ్వర్యంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సాయందర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, శ్రీ గౌతమేశ్వరాలయ చైర్మన్ తదితరులను గజానన యూత్ సభ్యులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గజానన యూత్ సభ్యులు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో ప్రజాప్రతినిధులు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో గజానన యూత్ సభ్యులు, స్థానికులు, యువత తదితరులు పాల్గొన్నారు. 🙏
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply