Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల
Home › బ్రేకింగ్ న్యూస్ › గణేష్ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
బ్రేకింగ్ న్యూస్

గణేష్ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి

01:33 మధ్యాహ్నం PM

మండపాలు, విగ్రహాలు, నిమజ్జనం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీపీ సూచించారు. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్ స్టేషన్, విగ్రహం మరియు మండపం ఎత్తు, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ప్రతిష్ఠాపన తేదీ తదితర వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు.

అదేవిధంగా గణేష్ నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం, నిమజ్జనానికి ఉపయోగించే వాహనం వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు.

ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని సీపీ కోరారు. మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించాలని సూచించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 25🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App