రాజారత్నం స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న కోచ్, మాస్టర్స్, విద్యార్థులు
హాలియా | అయుష్ 24 న్యూస్
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించే లక్ష్యంతో హాలియాకు చెందిన సత్య స్పోర్ట్స్ కరాటే డు అకాడమీ ఆఫ్ ఇండియా బృందం చెన్నైకి బయలుదేరనుంది. ఈ నెల 16-08-2026న చెన్నైలోని రాజారత్నం స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో అకాడమీ బృందం పాల్గొననున్నట్లు స్పోర్ట్స్ కోచ్ తంగెళ్ల సత్యనారాయణ రాజు తెలిపారు.

ఈ సందర్భంగా కోచ్ తంగెళ్ల సత్యనారాయణ రాజు మాట్లాడుతూ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే కార్యక్రమంలో పాల్గొనేందుకు హాలియా నుంచి కరాటే కోచ్‌లు, మాస్టర్స్, జూనియర్ ఇన్‌స్ట్రక్టర్‌తో పాటు విద్యార్థులు చెన్నైకి వెళ్తున్నట్లు తెలిపారు.
ఈ బృందంలో తంగెళ్ల సత్యనారాయణ రాజు (బ్లాక్ బెల్ట్ 6వ డాన్), అకాడమీ మాస్టర్స్ గుంటోజు హరికుమార్ (బ్లాక్ బెల్ట్ 2వ డాన్), మద్దెల నరేష్ (1వ డాన్), జూనియర్ ఇన్‌స్ట్రక్టర్ తంగెళ్ల వర్షిత్ రాజుతో పాటు విద్యార్థులు గుడిపాటి యోగిశ్వర్, వీరమళ్ల సహస్ర, ఎస్‌కే మెహరున్నిసా, మందారపు సాయి యశ్వంత్, సురే జ్యోషిత, గుంటోజు రుత్విక్ పాల్గొననున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు అభినందనలు
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు అభినందించారు. అలాగే ఆకాంక్ష స్కూల్, హాలియా పబ్లిక్ స్కూల్, శ్రీ చైతన్య పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
హాలియా నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలో పాల్గొంటున్న కరాటే బృందం విజయవంతంగా రికార్డు సాధించి తిరిగి రావాలని తల్లిదండ్రులు, విద్యార్థులు, క్రీడాభిమానులు ఆకాంక్షించారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply