Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › గిరిజన జానపద కళాకారిణి మాధురి రాథోడ్‌పై దాడి అమానుషం
బ్రేకింగ్ న్యూస్

గిరిజన జానపద కళాకారిణి మాధురి రాథోడ్‌పై దాడి అమానుషం

09:30 ఉదయం AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

వేములవాడ, అయుష్ 24 న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రెడ్డి భవన్‌లో బస చేసిన ఎస్టీ (లంబాడీ) వర్గానికి చెందిన వర్ధమాన గిరిజన జానపద కళాకారిణి మాధురి రాథోడ్‌పై జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమ చొరబాటు, భౌతిక దాడి, అసభ్యకర దూషణలు, ఆర్థిక మోసం, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననంపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్టీఐఎస్ఎస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కె. బాబురామ్ నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యులు కొర్ర లకపతి నాయక్, రామావత్ ధర్మానాయక్ సంయుక్తంగా కమిషన్ సభ్యులు జిల్లా శంకర్కు అధికారిక ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వేములవాడలో షూటింగ్ నిమిత్తం వచ్చిన మాధురి రాథోడ్ రెడ్డి భవన్‌లో ఆర్టీసీ వారికి కేటాయించిన గదిలో బస చేస్తున్న సమయంలో, తోటి నృత్యకారుడు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు మరికొందరు వ్యక్తులు ఆమె గదిలోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేశారని ఆరోపించారు. దాడిలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.అనంతరం బాధితురాలి వద్ద ఉన్న సుమారు రూ.50 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపించారు. గతంలో బాధితురాలి వద్ద నుంచి తీసుకున్నట్లు చెబుతున్న రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నగదును తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు, ఆమెను బెదిరించి లొంగదీసుకునేందుకు ఈ ఘటనకు కుట్ర పన్నినట్లు నాయకులు ఆరోపించారు.అదేవిధంగా బాధితురాలిని అసభ్యకరంగా దూషించడంతో పాటు, సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర వేదికల్లో అసత్య వీడియోలు, అభ్యంతరకర చిత్రాలను ప్రచారం చేసి ఆమె పరువుకు నష్టం కలిగించారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.ఫిర్యాదును స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ తీవ్రంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీతో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి కేసు నమోదు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి జిల్లా అధికార యంత్రాంగం నుంచి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తెప్పించుకుని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.బాధితురాలికి పోలీసు రక్షణ కల్పించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, భౌతిక దాడి, ఫోన్ చోరీ తదితర ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నట్లు ఆరోపిస్తున్న అభ్యంతరకర కంటెంట్‌పై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా విచారణ జరిపించాలని కోరారు.బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ సంఘాల తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తామని కె. బాబురామ్ నాయక్, కొర్ర లకపతి నాయక్, రామావత్ ధర్మానాయక్ స్పష్టం చేశారు.గమనిక: పై కథనంలోని దాడి, ఆర్థిక మోసం, ఫోన్ చోరీ, సోషల్ మీడియా ప్రచారం తదితర అంశాలు ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఆరోపణలపై అధికారిక దర్యాప్తు, పోలీసుల చర్యలు పూర్తయ్యే వరకు అవి నిర్ధారిత వాస్తవాలుగా పరిగణించరాదు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *