1,300 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
మంథని, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): మంథని మండలం గుంజపడుగు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.
గ్రామంలో మొత్తం 1,300 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ సదుపాయాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్క లక్ష్మి, వార్డు సభ్యులు దేవుళ్ల లక్ష్మి, బాగే రాజేశ్వరి, బోగే సంపత్, కాంగ్రెస్ నాయకులు బొల్లి సమ్మయ్య, కాశీపేట శ్రీకాంత్, జీపీవో రవీందర్, రేషన్ డీలర్లు పిన్న శ్రీనివాస్, కాశీపేట సాగర్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply