మెదక్, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వారణాసి నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన కలశాన్ని మెదక్ జిల్లాకు అందజేశారు.
రాబోయే ఏడు నెలల పాటు ఈ కలశాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా, మండలం, పట్టణం, గ్రామాల్లో ఊరేగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాస్కురి బాలరాజు ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర పార్టీ ప్రతినిధులు మెదక్ జిల్లాకు కలశాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గురు రవిదాస్ మహారాజ్ బోధనలు, సామాజిక సమానత్వం, మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు బబ్బురి కృష్ణ, సురేష్, రఘు, కర్రోల్ స్వామి, నిమ్మల స్వామి, దయాకర్, సరిత, పోచయ్య, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply