లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి, బీపీ, షుగర్ వైద్య శిబిరం
దేవరకొండ, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం లయన్స్ క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య అన్నారు.
బుధవారం దేవరకొండ మండలంలోని కర్నాటిపల్లి గ్రామంలో కీర్తిశేషులు కాశిరెడ్డి రఘుమారెడ్డి జ్ఞాపకార్థం, కాశిరెడ్డి నరేందర్ రెడ్డి కుమారుడు వినయ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ఉచిత కంటి, బీపీ, షుగర్ వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో 142 మందికి బీపీ, షుగర్ పరీక్షలు, 176 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షల్లో 15 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
లయన్స్ క్లబ్ సెక్రటరీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి కాశిరెడ్డి రఘుమారెడ్డి ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేస్తూ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. ఆయన జ్ఞాపకార్థం కర్నాటిపల్లి గ్రామంతో పాటు మరో 9 గ్రామపంచాయతీల్లో ఉచిత వైద్య సేవా శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిలుకూరి కాశీనాథ్, సీనియర్ లయన్స్ గాజుల రాజేష్, నల్లమాద నారాయణరెడ్డి, లకుమారపు మల్లయ్య, వనం శ్రీనివాసులు, సముద్రాల ప్రభాకర్, ఆప్టోమెట్రిస్ట్ హరి తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply