హైదరాబాద్, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026లో భాగంగా గ్లోబల్ మార్షల్ ఆర్ట్స్ గోల్డెన్ నంది అవార్డు అందుకున్న మాటురి మహా విష్ణు మూర్తిని పలువురు ప్రముఖులు అభినందించారు.
శివరాంపల్లి కాట్రగడ్డ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగసీతారాములు, 24వ వార్డు మాజీ కౌన్సిలర్ బాలేశెట్టి సత్యభామ, సుందర్ రాజ్, 25వ డివిజన్ కార్పొరేటర్ కే.కే. శ్రీను, జి. శ్రీనివాస్ రావు, టీ. ప్రణీత్, టీ. చైతన్య, నంది రాజశేఖర్, ముమీద్, కోరి జగదీష్, మధుబాబు తదితరులు మతూరి మహా విష్ణు మూర్తిని అభినందించారు.
విద్యా రంగంలో నాయకత్వం, విద్యార్థుల అభివృద్ధి, సేవా కార్యక్రమాలు మరియు సమాజానికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు అందుకున్నట్లు అవార్డు సర్టిఫికెట్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కటేదన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ,హైదరాబాద్ లో అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగినట్లు సర్టిఫికెట్లో ఉంది.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతను అభినందించిన పలువురు, ఆయన మరింతగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.










Leave a Reply