మున్సిపల్ సిబ్బందికి సన్మానం.. మహిళా పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ
పెద్దపల్లి, సెప్టెంబర్ 3, అయుష్ 24 న్యూస్:
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మూల హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి స్టేషన్ రోడ్డులోని హనుమాన్ ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని ఎం.కె.ఆర్. హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ సిబ్బందిలో సుమారు 50 మందిని సన్మానించారు. అలాగే మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేసి, పట్టణ పరిశుభ్రత కోసం వారు అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా మూల హరీష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోలోజు విశ్వజ్ఞాచారి, జావాజీ నవీన్, గొట్టె మధుకర్, చెల్కల సుమ యాదవ్, గుండేటి లావణ్య, కానిగంటి మంగ, గాజుల రమేష్, కంది రఘు, పల్లె శ్రావణ్ గౌడ్, మడుపు శివ, మచ్చ మహేష్, నూనె ఐలేశం, గుండేటి ఆశ్రిత్, దొంతు సతీష్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply