Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు
Home › బ్రేకింగ్ న్యూస్ › ఘనంగా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవం
బ్రేకింగ్ న్యూస్

ఘనంగా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవం

04:00 సాయంత్రం PM

దాతలను సన్మానించిన ఆలయ కమిటీ

దేవరకొండ, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో 35వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అభివృద్ధి, కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన దాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన దాతలు, భక్తులు, సేవకులు, నిర్వాహకులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లును ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఆలయ గౌరవ అధ్యక్షులు చేపూరి భీష్మాచారి, ప్రధాన కార్యదర్శి వింజమూరి బ్రహ్మచారి, కోశాధికారి కూరెళ్ల ఇంద్రాచారి మాట్లాడుతూ.. 35వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కోశాధికారి కూరెళ్ల ఇంద్రాచారి, ప్రచార కార్యదర్శులు, సహకార సభ్యులు, గౌరవ సలహాదారులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 45🔗 Shares: 5👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
224 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App