అయుష్ 24 న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
ఈ కార్యక్రమానికి టీఆర్పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మెరుగు చందర్ యాదవ్ మాట్లాడుతూ.. నాటి నైజాం పాలన, రజాకార్లు, భూస్వాముల అరాచకాలకు ఎదురొడ్డి తన భూమి, హక్కుల కోసం చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడారని అన్నారు. బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బహుజనులు, పేద ప్రజల హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మేరుగు సతీష్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేష్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు వెంగళ కృష్ణ, నాయకుడు గోగు సురేష్, సోషల్ మీడియా జిల్లా సెల్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply