అయుష్ 24 న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్, సెప్టెంబర్ 10: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, గడీల పాలనకు, దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని ఆమె వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
భూస్వామ్య దోపిడీకి, నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, పేదలు, బలహీన వర్గాల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని సీఎం తెలిపారు.
సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, హక్కుల కోసం పోరాడే సంకల్పం, సమాజ శ్రేయస్సు కోసం నిలబడే నిబద్ధత ప్రతి ఒక్కరిలో ఉండాలని చాకలి ఐలమ్మ జీవితం మనకు చాటి చెబుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.









Leave a Reply