ఇల్లందు, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: చింతోని చెలక గ్రామంలో ప్రజల సౌకర్యార్థం సైడ్ డ్రైన్, రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.
గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపడుతూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్, సర్పంచ్ మెట్ల తులసమ్మ, గ్రామస్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు!










Leave a Reply