ఎస్సీ మోర్చా బలోపేతంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
దేవరకొండ, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చాను బలోపేతం చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు.
ఇటీవల ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ పట్టణానికి చెందిన చిత్రం ఉదయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం ఉదయ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. యువకుడు, ఉత్సాహవంతుడైన చిత్రం ఉదయ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. దేవరకొండ వంటి ప్రధాన పట్టణాల్లో ఎస్సీ వర్గాలను భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించేందుకు చిత్రం ఉదయ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తూ, యువ రక్తాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తోందని తెలిపారు. యువకులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీజేపీ వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ | The Voice of Truth



Musini.Anjan





Leave a Reply