ఇల్లందు, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బొమ్మనపల్లి గ్రామానికి చెందిన చిన్నారి కావ్యను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం ఆమె నివాసంలో పరామర్శించారు.
చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, కావ్య త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
ఇటీవల ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి కావ్యను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పరామర్శించి రూ.20,000 ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే.
కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య, కోరం సురేందర్‌కు చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రజల కష్టాల్లో తోడుగా.. ప్రజా సేవలో ముందుగా..”
– కోరం కనకయ్య, కోరం సురేందర్










Leave a Reply