బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్ నాయక్ విరాళం
డిండి, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుడి మండపానికి బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్ నాయక్ రూ.10 వేల విరాళం అందజేశారు.
ఈ విరాళాన్ని పెద్దతండా మాజీ సర్పంచ్ కాట్రావత్ వెంకటేష్ చేతుల మీదుగా ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు 10వ వార్డు సభ్యుడు వింజమూరి వెంకటేశ్వర్లు, ముడి శ్రీను, గోరటి ఉపేందర్, లక్ష్మణ్, చిన్న, సాయి, భార్గవ్, రవితేజ, అంజి, నరేష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply