Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › Latest › జపాన్ పర్యటనలో మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
Latest

జపాన్ పర్యటనలో మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

06:37 ఉదయం AM

అంతర్జాతీయ స్థాయిలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం

హైదరాబాద్, ఆగస్టు 25, అయుష్ 24 న్యూస్:

తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి జపాన్‌లో పర్యటిస్తున్నారు.

పర్యటనలో భాగంగా మంత్రి జపాన్‌లోని కిండాయ్ యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన విధానాలతో పాటు పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య కొనసాగుతున్న అనుసంధానంపై అధ్యయనం చేశారు.

ముఖ్యంగా విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను ఎలా పొందుతున్నారు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధి అవకాశాలతో ఏ విధంగా అనుసంధానం చేస్తున్నారు అనే అంశాలను పరిశీలించారు.

జపాన్‌లోని ప్రముఖ పరిశ్రమలు, విద్యాసంస్థలతో తెలంగాణకు సహకారాన్ని మరింత పెంపొందించడం ద్వారా రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించారు.

తెలంగాణ యువతను అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడం, విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేయడంలో మంత్రి జపాన్ పర్యటన కీలకంగా నిలవనుంది.

“తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యం” అనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *