18వ మాన్‌సూన్ ట్రైనింగ్ క్యాంప్‌లో అధునాతన కరాటే టెక్నిక్స్‌పై శిక్షణ

హైదరాబాద్, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్:
జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ మాన్‌సూన్ ట్రైనింగ్ క్యాంప్ హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు.
జపాన్‌కు చెందిన ప్రముఖ కరాటే మాస్టర్స్ తనియామా, వై. హకిజుమే, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ చీఫ్ మాస్టర్ ఆనంద్ రత్న, తెలంగాణ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ సెన్సై రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం నిర్వహించారు.

ఈ క్యాంప్‌లో నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కరాటే మాస్టర్స్ పాల్గొని జపాన్ మాస్టర్స్ నుంచి కరాటేలోని అధునాతన కిహాన్ టెక్నిక్స్, కటాస్ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు.
కరాటేలోని ప్రాథమిక సాంకేతికతలను మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు, జపాన్ మాస్టర్స్ నుంచి ఆధునిక శిక్షణా పద్ధతులు, కటాస్‌లోని మెళకువలను నేర్చుకునే అవకాశం లభించిందని నిర్మల్ జిల్లా సీనియర్ కరాటే మాస్టర్స్ తెలిపారు.
తెలంగాణ కరాటే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సెన్సేయ్ తెజేందర్ సింగ్ భాటియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా శిబిరం ద్వారా కరాటే మాస్టర్స్‌కు సాంకేతిక పరిజ్ఞానం మరింత పెంపొందిందని వారు పేర్కొన్నారు.
ఇలాంటి శిక్షణా శిబిరాలు కరాటే క్రీడాకారులు, మాస్టర్స్ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎంతో ఉపయోగపడతాయని వారు తెలిపారు.
ఈ శిక్షణా శిబిరంలో నిర్మల్ జిల్లా సీనియర్ కరాటే మాస్టర్స్ కొండాజీ శ్రీకాంత్, భూషణ్, మృణాలిని, మనీషా, శ్రీకాంత్, శరణ్య, నితిన్, జ్ఞానతేజ, సోనితాయి, రిషికేష్, ప్రదీప్, ఆరిఫ్ ఖాన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply