జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రోస్టర్ పాయింట్ల సవరణ కోసం మాల మంత్రులు, యం ఎల్ ఏ లు, యం ఎల్ సి లు మాట్లాడాలి :-
మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి
*మాలలకు విద్య, ఉద్యోగాలలో తీవ్ర నష్టం జరిగే విధంగా ప్రభుత్వం రూపొందించిన రోస్టర్ విధానాన్ని సవరించేందుకు రేపు 07/09/2027నుండి జరగబోయే వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలలో మాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాలల పక్షాన తమ గొంతు వినిపించాలని లేని పక్షంలో మాలల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి పేర్కొన్నారు*
ఆదివారం దేవరకొండ పట్టణంలోని మాల మహానాడు రాజ గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 3 లోని మాల, ఉప కులాలు 26 కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించినప్పటికీ విద్యా ఉద్యోగ నోటిఫికేషన్ లో రెండు శాతం కూడా అవకాశాలు దక్కడం లేదని ఇది మాలల రాజ్యాంగబద్ధహక్కులను కాలరాయడమేనని, దీనిపై మాలలంతా 16 నెలలుగా వివిధ కార్యక్రమాలతో పోరాటం చేస్తున్నప్పటికీ మాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు నిమ్మకు నీరేత్తినట్టుగా ఉంటున్నారని, మంత్రి వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే నాగరాజు మాత్రమే జాతి పక్షాన మాట్లాడుతున్నారని మిగతావారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు అని , ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్క మాల శాసనసభ్యులు మాట్లాడాలని కోరారు అదేవిధంగా 2023లో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలలు అండగా ఉన్నారని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 01/08/ 2024 ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదని తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేసి మాలల ని అణిచిచివేయాలని చూస్తుందని రోస్టర్ పాయింట్లను సవరించి మాలలకు న్యాయం చేయనట్లయితే ప్రభుత్వానికి మాలలు తగిన గుణపాఠం చెప్తారని మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి హెచ్చరించారు ప్రభుత్వంపై పోరాడేందుకు భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు









Leave a Reply