Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › జాలే తిలక్ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం
బ్రేకింగ్ న్యూస్

జాలే తిలక్ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం

చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన JNR యువసేన కాలే విష్ణు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బి.ఎన్. రెడ్డి నగర్ ప్రాంతంలో మన యువ నాయకులు, గౌరవనీయులు శ్రీ జాలే తిలక్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి నికేతన్ ఫౌండేషన్లో ఏర్పాటు

09:01 రాత్రి PM

హైదరాబాద్, ఆగస్టు 28 — అయుష్ 24 న్యూస్

చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన JNR యువసేన కాలే విష్ణు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బి.ఎన్. రెడ్డి నగర్ ప్రాంతంలో యువ నాయకుడు, గౌరవనీయులు శ్రీ జాలే తిలక్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా శాంతి నికేతన్ ఫౌండేషన్లో జన్మదిన వేడుకలు నిర్వహించి, జాలే తిలక్ రెడ్డి చేత కేక్ కట్ చేయించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.

ఈ కార్యక్రమంలో జాలే బ్రదర్స్ శ్రీ జాలే నరసింహారెడ్డి, శ్రీ జాలే తిలక్ రెడ్డి పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా జాలే బ్రదర్స్ మాట్లాడుతూ, “అన్నదానమే ప్రాణశక్తికి మూలం. అన్నదానం చేయడం అంటే ప్రాణాన్ని దానం చేయడంతో సమానం” అని పేర్కొన్నారు. ఏ దానం చేసినా ఎదుటివారికి పూర్తి తృప్తి కలుగుతుందో లేదో కానీ, ఆకలి తీర్చే అన్నదానం మాత్రం కడుపు నింపి పరిపూర్ణ సంతృప్తిని ఇస్తుందని అన్నారు.

అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా భావించి అతిథులను, ఆకలితో ఉన్నవారిని దైవంతో సమానంగా చూసి సేవ చేయాలని తమ అనుచరులకు సూచించారు. అన్నదానం చేసేటప్పుడు మనసులో ప్రేమ, చేతల్లో ఆత్మీయత ఉండాలని తెలిపారు.

ఎలాంటి ఆశ లేకుండా చేసే సహాయం మనిషిని మానవత్వానికి ప్రతిరూపంగా నిలబెడుతుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జాలే బ్రదర్స్ అభిమానులు, JNR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

#మీJNRయువసేన
#AndalammaVenkatReddyFoundation
#JaleBrothersOfficial
#NarasimhaReddy
#TilakReddy
#DevarakondaConstituency
#అయుష్24న్యూస్
#TheVoiceOfTruth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *