Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం
Home › బ్రేకింగ్ న్యూస్ › జిల్లా స్థాయిలో పర్యాటక రంగంపై పోటీలు
బ్రేకింగ్ న్యూస్

జిల్లా స్థాయిలో పర్యాటక రంగంపై పోటీలు

04:11 సాయంత్రం PM

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు కాంపిటీషన్స్

దేవరకొండ, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలకు చెందిన యువ టూరిజం క్లబ్ సభ్యులకు పర్యాటక రంగంపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా టూరిజం అండ్ ఇన్ఫర్మేషన్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ తెలిపారు.

నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ, పర్యాటక శాఖల సమన్వయంతో ‘2047 వికసిత్ భారత్’, ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్యాల సాధనలో భాగంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

పర్యాటక రంగంపై యువతలో అవగాహన పెంపొందించేందుకు ఐదు కేటగిరీల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మొదటి కేటగిరీ: షార్ట్ ఫిల్మ్, రీల్స్ ద్వారా పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం.

రెండో కేటగిరీ: పాటలు, నృత్యం, డ్రామా, స్కిట్స్.

మూడో కేటగిరీ: ఆర్ట్స్, క్రాఫ్ట్స్.

నాలుగో కేటగిరీ: పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు.

ఐదో కేటగిరీ: పర్యాటక ప్రాంతాల్లో హెరిటేజ్ వాక్, ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు.

కళాశాల స్థాయి జిల్లా పోటీలు సెప్టెంబర్ 22, 2026న నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు అదే రోజు ఉదయం 8:30 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.

అదేవిధంగా పాఠశాల స్థాయి జిల్లా పోటీలు సెప్టెంబర్ 24, 2026న దేవరకొండ ఖిల్లా వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు మహమ్మద్ అక్బర్ అలీ తెలిపారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు:
📞 99859 30885
📞 80744 87020

పాఠశాల స్థాయి సమాచారం కోసం:
📞 ఫర్హాన్, టూరిజం అడ్వైజర్ – 99664 59755

మరిన్ని వివరాల కోసం సంబంధిత కళాశాలల ఉపాధ్యాయులు, యువ టూరిజం క్లబ్ సభ్యులు, పాఠశాలల ప్రతినిధులు సంప్రదించాలని జిల్లా టూరిజం అండ్ ఇన్ఫర్మేషన్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ ఒక

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 37🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
224 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App